Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కోడి తల తెగినా ప్రాణాలు నిలబెట్టుకుంది.. 18 నెలలు జీవించింది... ఎలా?

చాలా మంది వ్యక్తులు.. నా తల తెగినా సరే.. మాట తప్పను అంటూ భీష్మ శపథాలు చేస్తుంటారు. మనుషుల సంగతి ఏంటో గానీ.. ఆ కోడి మాత్రం.. నిజంగానే తల తెగిపడినా తన ప్రాణాలు మాత్రం నిలబెట్టుకుంది. అది కూడా ఏదో కాళ్లీ

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (17:13 IST)
చాలా మంది వ్యక్తులు.. నా తల తెగినా సరే.. మాట తప్పను అంటూ భీష్మ శపథాలు చేస్తుంటారు. మనుషుల సంగతి ఏంటో గానీ.. ఆ కోడి మాత్రం.. నిజంగానే తల తెగిపడినా తన ప్రాణాలు మాత్రం నిలబెట్టుకుంది. అది కూడా ఏదో కాళ్లీడ్చుకుంటూ కాదు. నిటారుగా నిలబడుతూనే, ఠీవిగా నడుస్తూనే!... ఏకంగా 18 నెలల పాటు జీవించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అమెరికాలోని కొలరాడోలోని ఫ్రూటా నివాసి లాయిడ్‌ ఓల్సెన్. ఈయన భార్యకు కోడికూర తినాలనే ఆశ కలిగింది. ఈ ఆశకూడా దీర్ఘకాలికంగా ఉంది. దీంతో ఓ రోజున రాత్రి భోజనానికి చక్కగా పనికొచ్చేలా ఓ ఐదున్నర మాసాల వయసు కోడిని కొనుగోలు చేశాడు. దీనికి మైక్ అనే పేరు పెట్టాడు. ఈ కోడిని చంకలో బెట్టుకుని ఇంటికి చేరుకున్న ఆయన.. భార్య కోర్కె మేరకు కత్తితో కోడి తలపై ఒక్క వేటు వేశాడు. అంతే.. తల తెగి.. అల్లంత దూరాన పడింది. ఇక కూర వండుకు తినడమే తరువాయి అనుకున్నాడు ఆ భార్యాభర్తలు. 
 
కానీ, ఇక్కడ విచిత్రమేమింటే.. ఆ కోడి చావలేదు కదా.. రెండు కాళ్లపై నిటారు నిల్చుంది. దీంతో ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. అదో వింతగా చూస్తుండిపోయారు. ఇంత జరిగాక కూడా దాన్ని కోసుకుతింటే బాగోదనిపించి, ఆయన పెంచుకోవడం మొదలుపెట్టాడు. దానికి ఐ డ్రాపర్‌ సహాయంతో నీళ్లు, ఆహారం అందించేవాడు. అలా దాదాపు 18 నెలలపాటు ఆరోగ్యంగా జీవించింది ఆ కోడి. చివరకు ఓ రోజు లాయిడ్‌ ఆహారం తినిపిస్తుండగా మైక్‌ ఆహార నాళం పూర్తిగా మూసుకుపోయింది. అలా ఊపిరాడక పైలోకాలకు చేరుకుంది.  

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments