Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావి భారత ప్రధానమంత్రి బాబా రాందేవ్? ఎవరు చెప్పారు?

యోగా గురువు రాందేవ్ బాబా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యోగాతో స్వదేశంలోనేకాకుండా, విదేశాల్లో కూడా ఆయన మంచి పేరు దక్కించుకున్నారు. అయితే, ఈయన భావి భారత ప్రధానమంత్రి కాబోతున్నారట. ఈ మేరకు అమెరికా

Webdunia
శనివారం, 28 జులై 2018 (15:37 IST)
యోగా గురువు రాందేవ్ బాబా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యోగాతో స్వదేశంలోనేకాకుండా, విదేశాల్లో కూడా ఆయన మంచి పేరు దక్కించుకున్నారు. అయితే, ఈయన భావి భారత ప్రధానమంత్రి కాబోతున్నారట. ఈ మేరకు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
 
'ది బిలియనీర్ యోగి బిహైండ్ మోడీస్ రైజ్' (మోడీ ఎదుగుదల వెనుక సంపన్న యోగి) అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కిన బాబా రాందేవ్... భారత్‌తో పాటు విదేశాల దృష్టిని ఆకర్షించడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పింది. పైగా, అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్‌కు భారత సమాధానం రాందేవ్ అని తెలిపింది. తనకు తానుగా ప్రధాని రేసులోకి వెళతాడన్న చర్చ కూడా రాందేవ్‌పై జరుగుతోందని పేర్కొంది. 
 
ట్రంప్‌తో రాందేవ్ పోల్చడానికి గల కారణాలను కూడా విశ్లేషించింది. ట్రంప్ మాదిరే రాందేవ్ కూడా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి నేతృత్వం వహిస్తున్నారని ఆ కథనంలో పేర్కొంది. భారత్‌లో యోగా గురువుగా రాందేవ్‌కు తిరుగులేదని పేర్కొంది. దేశంలోని ప్రతి చోట అతని పేరు, ముఖం కనిపిస్తుందని చెప్పింది. భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన ప్రధాని కాగలడని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments