Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్ మహిళ కౌగిలింతల వ్యాపారం.. నో సెక్స్.. అయినా భలే డిమాండ్

అమెరికాకు చెందిన ఓ మహిళ సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ వ్యాపారం పేరు కౌగిలింతలు. ఆరంభంలో పార్ట్‌టైమ్‌గా ప్రారంభించిన ఈ బిజినెస్‌ను ఇపుడు ఏకంగా ఫుల్‌టైమ్‌గా మార్చేసి... వారానికి రూ.లక్ష వరకు స

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (11:17 IST)
అమెరికాకు చెందిన ఓ మహిళ సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ వ్యాపారం పేరు కౌగిలింతలు. ఆరంభంలో పార్ట్‌టైమ్‌గా ప్రారంభించిన ఈ బిజినెస్‌ను ఇపుడు ఏకంగా ఫుల్‌టైమ్‌గా మార్చేసి... వారానికి రూ.లక్ష వరకు సంపాదిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అమెరికా టెక్సాస్‌ రాష్ట్రం శాన్‌ అంటోనియోకు చెందిన జనెత్‌ ట్రెవీనో అనే 37 మహిళ... తన మాటల తీరుతో కౌగిలింతలను పూర్తి వ్యాపారంగా మార్చేసింది. ఇందుకు ఆమె భర్త జెనెత్‌ భర్త కార్లోస్‌ కూడా పూర్తిగా సహకరించడం గమనార్హం. 40 నుంచి 70 ఏళ్ల పురుషులను గంటకు 80 డాలర్లు (దాదాపు రూ.5,500) ఫీజు తీసుకొని కౌగిలించుకుంటుంది. ఇలా కౌగిలించుకుంటూ వారానికి 1600 డాలర్లు (దాదాపు 10,9000) సంపాదిస్తోంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ "ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడం అవసరం. వారిని హృదయానికి దగ్గరగా తీసుకొని వారిలో నమ్మకాన్ని పెంచేలా చేస్తే వారిలో మంచి మార్పులు వస్తాయి. అందుకే నేను కౌగిలింత సేవలను అందిస్తున్నాను. మొదట్లో పార్ట్‌ టైంగా ప్రారంభించిన ఈ కౌగిలింతల వ్యాపారానికి డిమాండ్‌ పెరగడంతో దానిని ఫుల్‌ టైంగా మార్చుకున్నాను. ఇందుకోసం కడ్డలిస్ట్‌.కామ్‌ అనే వెబ్‌ సైట్‌ ద్వారా కౌగిలింతలపై ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నాను" అని జెనెత్‌ తెలిపింది. అయితే, సెక్స్‌కు తావు లేకుండా అందరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం