Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరపాటున థ్యాంక్యూ సర్ అన్నందుకు... మహిళను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు..

వరుణ్
శుక్రవారం, 28 జూన్ 2024 (11:36 IST)
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ విచిత్ర ఘటన ఒకటి జరిగింది. ఆస్టిన్‌కు వెళ్లేందుకు తన బిడ్డ, తల్లితో విమానాశ్రయానికి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు విమాన మహిళా సిబ్బందికి బోర్డింగ్ పాస్ ఇచ్చే క్రమంలో పొరపాటున థ్యాంక్యూ సర్ అంటూ ధన్యవాదాలు చెప్పింది. దీనిపై మహిళా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని ఆ మహిళా ప్రయాణికురాలిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా అనే మహిళ తన కుమారుడు, తల్లి కలిసి ఆస్టిన్ వెళ్లేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి తమ బోర్డింగ్ పాస్ అందజేశారు. ఈ క్రమంలో జెన్నా.. మహిళా అటెండెంట్‌ను పురుషుడుగా పొరపాటుపడి థ్యాంక్యూ సర్ అని సంబోంధించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ సిబ్బంది... జెన్నాతో పాటు ఆమె తల్లి, కుమారుడిని కూడా లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. 
 
ఈ క్రమంలో జెన్నా మరో సిబ్బంది సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేటు వద్దే ఆయన ఆపేశారని ఫిర్యాదు చేసింది. ఆ అటెండెంట్ ఆయన కాదు ఆమె అని బదులిచ్చారు. తప్పు తెలుసుకున్న జెన్నా క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. తన ఆవేదనను నెట్టింట వెళ్లబోసుకున్న జెన్నా.. తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments