Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్‌మార్కెట్‌లో గన్‌ కాల్పులు.. పది మంది మృతి..ఎక్కడ

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:15 IST)
అమెరికాలో గన్‌కల్చర్ మరోసారి జడలు విప్పింది.  రెండు రోజుల క్రితం నైట్‌ క్లబ్‌లో కాల్పుల ఘటన మరువక ముందే మరోసారి తూటాలు పేలాయి. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఒక దుండగుడు సూపర్‌ మార్కెట్‌లో కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో పోలీస్‌ అధికారి సహా పది మంది మరణించారు. ఈ కాల్పులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డెన్వర్‌కు వాయువ్యంగా 30 మైళ్ల దూరంలోని బౌల్డర్‌లోని కింగ్‌ సూపర్స్‌ దుకాణంలో స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు బౌల్డర్‌ పోలీస్‌ కమాండర్‌ కెర్రీ యమాగుచి తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే ఈ భవనానికి చేరుకున్నామని అన్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. దాడి జరిగిన ప్రాంతంలో అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కొలరాడో గవర్నర్‌ జేర్డ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

బౌల్డర్‌లో జరిగిన విషాదకర ఘటన పట్ల దిగ్బ్రాంతికి గురయ్యానని అన్నారు. అక్కడి పరిస్థితులన్ని నిశితంగా గమనిస్తున్నానని జేర్డ్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, ఇటీవల అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై దుండగులు కాల్పులకు పాల్పడటం సంచలనం సృష్టించిన  సంగతి తెలిసిందే. జాత్యహంకారం, వివక్షలపై మౌనం వీడాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments