Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు పోలీస్‌ను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్.. కారణం ఏంటి?

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (22:59 IST)
తమిళనాడు ప్రత్యేక సబ్-ఇన్‌స్పెక్టర్‌ను బంగ్లాదేశ్ సైన్యం అక్రమంగా పొరుగు దేశంలోకి ప్రవేశించినందుకు గాను అరెస్టు చేసింది. పోలీసు అధికారి తిరుచ్చికి చెందిన జాన్ సెల్వరాజ్‌గా గుర్తించారు. బంగ్లాదేశ్ సైన్యం అతన్ని అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసు అధికారులు ధృవీకరించారు. 
 
అయితే అరెస్టుకు గల కారణాన్ని తెలియజేసారు. అతను స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. తాంబరం కమిషనరేట్ ఆఫ్ పోలీస్‌కి అనుబంధంగా ఉన్న సెలైయూర్ పోలీస్ స్టేషన్‌లో నియమించబడ్డాడు. 
 
ఈ నేపథ్యంలో రిటైర్డ్ పోలీస్ అయిన జాన్ సెల్వరాజ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు కొన్ని రోజులు సెలవులో ఉన్నారు. అతను మార్చి 19 నుండి రెండు రోజులు సెలవుపై వెళ్లి, దానిని పొడిగిస్తూ పోస్టల్ కమ్యూనికేషన్ పంపాడు. అయితే సింగపూరులో కొద్దికాలం పోలీస్ సర్వీసును వదిలిపెట్టి పని చేసి.. తిరిగి విధుల్లో చేరాడు. 
 
ఈ నేపథ్యంలో సెల్వరాజ్ అధికారిక పని నిమిత్తం బంగ్లాదేశ్ వెళ్లలేదని తాంబరం పోలీసు కమిషనరేట్ అధికారులు తెలిపారు. వారు అతని పర్యటన యొక్క ఉద్దేశ్యాన్ని పరిశీలిస్తున్నారు. సెల్వరాజ్ బంగ్లాదేశ్ సరిహద్దుకు ఎందుకు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments