Webdunia - Bharat's app for daily news and videos

Install App

350 మంది తాలిబన్ తీవ్రవాదుల హతం : కొరకరాని కొయ్యిలా పంజ్‌షిర్ ప్రావిన్స్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (14:49 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని పూర్తిగా కైవసం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులకు పంజ్‌షిర్ ప్రావిన్స్ ప్రాంతం మాత్రం కొరకరాని కొయ్యిలా మారింది. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టాలని భావించే తాలిబన్ తీవ్రవాదులను ఆ ప్రాంత వాసులు హతమార్చుతున్నారు. మంగళవారం ఒక్కరాత్రే ఏకంగా 350 మంది తాలిబన్ తీవ్రవాదులను పంజ్‌షిర్ ప్రాంత వాసులు హతమార్చారు. 
 
ముఖ్యంగా, పంజ్‌షిర్ ప్రావిన్స్‌లోని ప‌లు ప్రాంతాలు.. ప‌ర్వాన్ ప్రావిన్స్‌లోని జ‌బ‌ల్ స‌రాజ్ జిల్లా.. బ‌ఘ్లాన్ ప్రావిన్స్‌లోని రెండు జిల్లాల్లో తాలిబ‌న్లు, తిరుగుబాటుదారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో మృతుల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ స్పష్ట‌త లేక‌పోయినా.. తాము 350 మంది తాలిబ‌న్ల‌ను హ‌త‌మార్చామ‌ని, మ‌రో 40 మందిని బందీలుగా చేసుకున్నామ‌ని నార్త‌ర్న్ అల‌యెన్స్ ప్రకటించింది. 
 
గుల్‌బ‌హార్ నుంచి త‌మ పంజ్‌షిర్ లోయ‌లోకి అడుగుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన తాలిబ‌న్ల‌పై తిరుగుబాటుదారులు దాడి చేసిన‌ట్లు టోలో న్యూస్ కూడా తెలిపింది. 'మిమ్మ‌ల్ని లోయ‌లోకి రానిస్తాము కానీ.. మళ్లీ బ‌య‌ట‌కు వెళ్ల‌నీయ‌ం' అంటూ' తాలిబ‌న్ల‌ను ఉద్దేశించి నార్త‌ర్న్ అలయెన్స్ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments