Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

ఠాగూర్
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (14:27 IST)
ఆప్ఘనిస్థాన్ రాష్ట్రంలోని తాలిబన్ ప్రభుత్వం పురుషులపై కూడా కత్తి కట్టింది. కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులు, కేశాలను అందంగా కట్ చేసే క్షురకులకు కూడా ప్రత్యేక శిక్షలను విధించనుంది. ఈ మేరకు ఆ దేశ సదాచార, దురాచార నిరోధక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని విడుదల చేసింది. 
 
ఆధునిక పోకడపోయి జుత్తు అందంగా కత్తిరించుకుంటే ఇక జైలు ఊచలు లెక్కించుకోవాల్సిందేనని హెచ్చరించింది. జుత్తును అందంగా కత్తిరించుకున్న పురుషులతో పాటు వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కట్టుబాట్లు పేరుతో ఇప్పటివరకు మహిళలపై అనేక ఆంక్షలు విధించి తాలిబన్లు ఇపుడు పురుషులపై కూడా పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తాలిబన్ ప్రభుత్వంలోని సదాచార, దురాచార నిరోధక మంత్రిత్వ శాఖ చర్యల వల్ల కులవృత్తులవారు కూడా నష్టపోతున్నారని తెలిపింది. బస్సులు, రైళ్ళలో ప్రయాణించేటపుడు ఎలా ప్రవర్తించాలి, క్షవరం, సంగీతం, పండగ రోజుల్లో సందడిపై గతేడాది ఆగస్టులో ఈ శాఖ ప్రత్యేక నియమావళి విడుదల చేసింది. 
 
దీని ప్రకారం.. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపకూడదు. బహిరంగంగా మాట్లాడకూడదు. దీనిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 3300 మంది ఇన్‌స్పెక్టర్లను నియమించింది. అరెస్టు అయిన వారిలో ఎక్కువమంది గడ్డాన్ని నిర్ధిష్ట రీతిలో కత్తిరించుకోని, క్షవరం చేయించుకోని పురుషులు, వారి క్షరకులే ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments