Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూసైడ్ బాంబర్లు నిజమైన హీరోలు : ఆప్ఘన్ హోం శాఖామంత్రి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (09:00 IST)
తమ ఉన్మాద చర్యలతో అనేక మంది ప్రాణాలు బలితీసుకుంటున్న సూసైడ్ బాంబర్లను ఆప్ఘనిస్థాన్ దేశ పాలకులు నిజమైన హీరోలుగా అభివర్ణిస్తున్నారు. పైగా, సూసైడ్ బాంబర్లపై ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు. 
 
ఈ మధ్యకాలంలో ఆ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడులతో వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్నారు. ఆ దేశంలో జరుగతున్న సూసైడ్ దాడులతో పలువురు సూసైడ్ బాంబర్లు పాల్గొంటున్నారు. వీరిపై తాలిబన్ మంత్రి ప్రశంసలు కురిపించారు. 
 
ఈ సూసైడ్ బాంబర్లు అమరవీరులంటూ కొనియాడారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆఫ్ఘన్ హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
సూసైడ్ బాంబర్ల త్యాగాలు ఎనలేనివని ప్రశంసించారు. వారు ఈ దేశానికి, ఇస్లాంకు హీరోలని అభివర్ణించారు. వారి కుటుంబాలకు 10,000 ఆఫ్ఘానీలు (125 డాలర్లు), ఓ ఫ్లాట్ ఇస్తామని మంత్రి ప్రకటించినట్టు స్థానిక మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
 
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఇటీవల వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 8న కుందుజ్ ప్రావిన్స్‌లో, 15న కాందహార్‌లోని షియా మసీదులో జరిగిన ఆత్మహుతి దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షియా ముస్లింలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments