Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌లో విహరించారు..

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:31 IST)
తాలిబన్ల ఆప్ఘన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వుంటున్నా వారి అరాచకాలకు బ్రేక్ పడటం లేదు. అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరగ్గానే కాబూల్‌ ఎయిర్‌పోర్టును ఆక్రమించుకున్నారు. తాజాగా మంగళవారం ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌లో విహరించారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యావత్ ప్రపంచం వీరి ఆగడాలకు హడలిపోతుంది. అఫ్గాన్‌ను విడిచి వెళ్లే క్రమంలో కొన్ని ఆయుధాలను అమెరికా సైన్యం వదిలేసిపోయింది. అందులో హెలికాప్టర్ కూడా ఉండటంతో దానితోనే తాలిబన్లు కాందహార్‌లో విహరించారు.
 
ఆ హెలికాప్టర్‌కు వ్యక్తిని తాడుతో వేలాడదీసి గాల్లో ఎగురుతున్న వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అది మృతదేహమేనని, చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారంటూ పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదంతా అమెరికా తప్పిదమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
 
సోమవారం అర్ధరాత్రే అగ్రరాజ్య దళాలు హడావుడిగా నిష్క్రమించాయి. తాము వెళ్లేముందే అక్కడున్న ఆయుధాలన్నింటినీ నిర్వీర్యం చేశామని పేర్కొన్నప్పటికీ.. సాధ్యం కాలేదని స్థానిక మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments