Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఇంట్లో ఉన్నారు.. భార్య మెసేజ్‌లు పట్టించుకోని భర్త.. విడాకులు మంజూరు

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భర్త హింసిస్తున్నాడని.. మనస్పర్ధలు ఉన్నాయని సంసారానికి పనికిరాడని విడాకులు తీసుకునే మహిళలు చాలామంది. కానీ భర్త తన పంపిన మెసేజ్‌లకు రిప

Webdunia
శనివారం, 22 జులై 2017 (16:50 IST)
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భర్త హింసిస్తున్నాడని.. మనస్పర్ధలు ఉన్నాయని సంసారానికి పనికిరాడని విడాకులు తీసుకునే మహిళలు చాలామంది. కానీ భర్త తన పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదని ఓ భార్య విడాకులు తీసుకున్న ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. తైవాన్‌కి చెందిన లిన్‌ అనే మహిళ తన భర్త తాను చేసిన మెసెజ్‌లకు రిప్లై ఇవ్వట్లేదని, తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ మహిళ తన భర్తకు దూరమైంది. 
 
లిన్ గత ఆరు నెలల పాటు తన భర్తకు లైన్‌ అనే మెసెజింగ్‌ యాప్‌ ద్వారా మెసేజ్‌లు పంపింది. అయితే వాటిని చూసినప్పటికీ ఆమె భర్త బదులు ఇవ్వలేదు. దీంతో ఒకే ఇంట్లో ఉంటున్నా కొన్నాళ్లుగా ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అంతెందుకు ఒకసారి లిన్‌ కారు ప్రమాదానికి గురైన సమయంలో మెసేజ్‌ పెట్టినా.. చూసి కూడా రిప్లై ఇవ్వలేదట. ఇలా తన పట్ల భర్త నిర్లక్ష్యంగా వుండటం ద్వారా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. 
 
తన భర్త మెసేజ్‌లకు బదులు ఇవ్వకపోగా.. తన తల్లిదండ్రులకు.. సోదరీమణులకు సేవలు చేయాలని ఆర్డర్‌ వేస్తున్నాడట. అంతేకాకుండా వారి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడని తన గోడును కోర్టులో వెల్లబుచ్చింది. అంతా వినిన న్యాయమూర్తి లిన్‌కు విడాకులు మంజూరు చేశారు.

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments