Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్‌ను జయించిన వ్యక్తి... మహమ్మారిపై మొదటి గెలుపు

ప్రాణాంతక సుఖవ్యాధి ఎయిడ్స్‌పై ఓ వ్యక్తి విజయం సాధించాడు. ప్రపంచంలో ప్రాణాంతక మహమ్మారిపై తొలి గెలుపు ఇదే కావడం గమనార్హం. హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఏళ్ల తరబడి చికిత్స జరిపి శరీరం నుంచి వైరస్‌ను

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (12:32 IST)
ప్రాణాంతక సుఖవ్యాధి ఎయిడ్స్‌పై ఓ వ్యక్తి విజయం సాధించాడు. ప్రపంచంలో ప్రాణాంతక మహమ్మారిపై తొలి గెలుపు ఇదే కావడం గమనార్హం. హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఏళ్ల తరబడి చికిత్స జరిపి శరీరం నుంచి వైరస్‌ను పూర్తిగా పారద్రోలారు జర్మనీ వైద్యులు ప్రకటించారు. తద్వారా ఈ మహమ్మారిపై పోరాడుతున్న లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురించేలా చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... 1966లో జన్మించిన రాయ్ బ్రౌన్‌కు 1995లో ఎయిడ్స్ సోకినట్టు వెల్లడైంది. ఆపై చికిత్స కోసం బెర్లిన్ కు వెళ్లాడు. తనపైనే పరిశోధనలు చేయాలని డాక్టర్లను కోరాడు. 2007 నుంచి 'స్టెమ్ సెల్ ప్లాంటేషన్' అనే చికిత్సా పద్ధతి ద్వారా వైద్యులు, అతనిలోనీ సీడీ4 కౌంట్‌ను పెంచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అతని రోగనిరోధక శక్తి పెరుగుతూ వచ్చింది.
 
ఇదేసమయంలో రిట్రో వైరల్ థెరపీని చేస్తూ, కొన్ని సంవత్సరాలుగా రాయ్ బ్రౌన్‌కు చికిత్స చేస్తూ వచ్చారు. ఇప్పుడు అతను హెచ్ఐవీ నెగటివ్. అతని శరీరంలో ఎక్కడా వైరస్ ఆనవాళ్లు లేవని, ఎయిడ్స్ నుంచి రాయ్ సురక్షితంగా బయటపడ్డాడని వైద్యులు వెల్లడించారు. హెచ్ఐవీకి విరుగుడు కనిపెట్టేందుకు నేటి వైద్య శాస్త్రం దశాబ్దాలుగా పడుతున్న కష్టానికి రాయ్ బ్రౌన్ కథ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, ఆత్మ విశ్వాసం ఉంటే దేన్నైనా జయించవచ్చని నిరూపించాడితను.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments