Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముతో కలలో శారీరక సంబంధం.. అబ్బాయి పుట్టాడు!!: నైజీరియన్ మహిళ

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (18:30 IST)
పాముతో శారీరక సంబంధం కలిగిన ఓ నైజీరియన్ యువతి ఓ మగశిశువుకు జన్మినిచ్చిందట. అదికూడా కలలో వచ్చే నాగంతోనే తనకు పిల్లాడు పుట్టాడని బల్ల గుద్ది మరీ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. నైరుతి నైజీరియాలో ఉన్న ఓయో రాష్ట్రం, ఒగ్బొమొసొకు చెందిన 19 ఏళ్ల యువతి కెహిండేకు గత నాలుగేళ్లుగా కలలో పాము కన్పించడమే కాకుండా పాముతో దాంపత్య సంబంధాన్ని ఏర్పరుచుకోవడం ద్వారానే గర్భం ధరించినట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది.
 
నాలుగేళ్లుగా రాత్రిపూట కలలో ఓ పాము రావడం.. ఉన్నట్టుండి ఆ పాము ఓ మనిషి రూపం దాల్చడం.. తర్వాత శారీరకంగా కలవడం.. తదనంతరం పాము రూపంగా మారిపోయి అదృశ్యమవడం జరిగిపోయిందని చెప్పింది. ఇలా కలలో పాముతో శారీరక సంబంధం కలిగివుండటం చేతనే తనకు అబ్బాయి పుట్టాడని  కెహిండే చెప్పింది. ఇంతవరకూ తాను ఏ వ్యక్తితోనూ శారీరక సంబంధం కలగలేదని ప్రమాణం చేసి మరీ చెప్తోంది. 
 
ఇంకా మార్చి 28వ తేదీన కెహిండేకు అచ్చం పాము పళ్లతో కూడిన అబ్బాయి పుట్టాడు. అయితే ఒకే ఒక రోజు మాత్రమే ప్రాణాలతో ఉండిన ఆ శిశివు మార్చి 29వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. దీనిపట్ల కెహిండే ఇంకా మాట్లాడుతూ.. గత ఏడాది 2014 అక్టోబర్‌లో తాను గర్భంగా ఉన్నట్లు తెలియవచ్చింది. తాను గర్భంగా ఉండటంపై పక్కన అక్కనోళ్లు చీవాట్లు పెట్టారు. తల్లిదండ్రులు పూర్తిగా నమ్మలేదని.. దీంతో ఇంటి నుంచి బయటపడిన తనకు ఓయోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ శిశువు పుట్టాడని.. పుట్టిన వెంటనే పాము చర్మం, పళ్లతో పుట్టిన వాడికి పాలివ్వడం కూడా భయమేసిందని, బాబు పుట్టాక కలలో పాము రావడం మానేసిందని చెప్పింది. 
 
ఇకపోతే.. కెహిండే చెప్పడం ఆశ్చర్యమేసినా.. నమ్మశక్యంగా లేకపోయినా నైజీరియా ప్రజలకు దెయ్యం, పిశాచి, పిల్లిశూన్యం వంటి మాంత్రిక శక్తులపై అధిక నమ్మకం ఉంది. మరి ఈ ఘటనను ఏ మేరకు నమ్మాలో..?

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి