Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాలో కత్తులతో రెచ్చిపోయిన దండుగులు - పది మంది మృతి

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:30 IST)
కెనడా దేశంలోని సాస్కట్చేవాన్ ప్రావిన్స్‌లో దండుగులు కత్తులతో రెచ్చిపోయారు. ఈ దాడిలో ఏకంగా పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. దీంతో కెనడా పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో ఇద్దరు అనుమానితుల ఫోటోలను కూడా వారు విడుదల చేశారు. 
 
దుండగులు కత్తులతో జరిపిన స్వైరవిహారంపై కెనడా పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తూ, అనుమానితులను డామియన్ శాండర్సన్, మైల్స్ శాండర్సన్‌గా గుర్తించారు. కొంత మంది వ్యక్తులను టార్గెట్ చేసి దుండగులు 13చోట్ల ఈ డాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంత మందిని యాధృచికంగా చంపేసి ఉంటారని భావిస్తున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించి మొదటి కాల్‌ ఉదయం 5.40 గంటలకు వచ్చినట్టు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని.. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. ఈ భయంకరమైన దాడిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments