Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ సూడాన్‌లో వింత సంప్రదాయాలు.. శోభనం జరిగిన వ్యక్తితో..?

Webdunia
శనివారం, 15 మే 2021 (15:51 IST)
ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్ ప్రాంతంలో జరిగే పెళ్లిళ్లు చాలా వింతగా జరుగుతుంటాయి. ఇక్కడ పెళ్లి చూపుల వంటి తతంగాలు ఉండవు. వధువులను సంతలో వేలంపాటలో పశువులను అమ్మినట్లు అమ్మేస్తారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే ఆ అమ్మాయి వారి సొంతం.
 
ఇది భారతదేశంలో వుండిన కన్యాశుల్కం పద్ధతి లాంటిది. అమ్మాయిని వేలానికి పెట్టిన తర్వాత నగదు, విలువైన వస్తువులు లేదా పశు సంపదను ఇవ్వడం ద్వారా పాటను పాడుకోవాలి. అత్యంత విలువైన వస్తువులు ఎవరు ఇస్తే వారికే ఆ అమ్మాయి దక్కుతుంది. ఇటీవల దక్షిణ సూడాన్‌లో ఒక వ్యాపారవేత్త ఇలాంటి వేలంలో 500 ఆవులు, 3 లగ్జరీ కార్లు, రూ. 1.44 లక్షలు కట్నంగా ఇచ్చి 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
 
ఇక సూడాన్‌లోని మరో ప్రాంతంలో ఒక దుష్ట సాంప్రదాయం ఉంది. అత్యంత పేదరికంతో ఉన్న కుటుంబాలు అమ్మాయిలకు పెళ్లి చేయలేక ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఇది అత్యంత దారుణమైన సాంప్రదాయం. ఎందుకంటే ఈ పద్దతిలో అమ్మాయిని శవానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. 
 
అమ్మాయికి పెళ్లి చేసేంత స్తోమత లేని తల్లిదండ్రులు.. చావుకు దగ్గర పడిన వ్యక్తి ఇంటికి వెళ్లి సంబంధం కలుపుకుంటారు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి శవానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతే కాదు.. చనిపోయిన వ్యక్తికి సోదరులు ఉంటే వాళ్లతో శోభనం జరిపిస్తారు.
 
దారుణమైన విషయం ఏమిటంటే.. ఆ అమ్మాయి అధికారికంగా శవానికే భార్య.. కానీ ఆ శోభనం జరిగిన వ్యక్తితో అసలు సంబంధమే ఉండదు. అయితే శవంతో పెళ్లిన అమ్మాయిని వితంతువుగా మాత్రం భావించరు. ఇదొక దుష్ట సాంప్రదాయంగా ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఉద్యమాలు జరిపాయి. ఇప్పుడిప్పుడే సూడాన్ మహిళల్లో చైతన్యం వచ్చి.. ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోమని తెగేసి చెబుతున్నారు.
 
ఇక పెళ్లి తర్వాత కూడా కొన్ని సాంప్రదాయాలు పాటిస్తుంటారు. వివాహం చేసుకున్న అమ్మాయి తప్పని సరిగా ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వాలి. అలా ఇవ్వకపోతే విడాకులు తీసుకొని వేరే యువతిని పెళ్లి చేసుకునే హక్కు పురుషుడికి ఏర్పడుతుంది. 
 
అయితే ఆ లోపం పురుషుడిలో ఉందా స్త్రీలో ఉందా అనేది గమనించకుండా.. అలా చాలా పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ సూడాన్‌లో కొనసాగుతున్న ఈ దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కొన్ని విధానాలు రూపొందించింది. అంతర్జాతీయ సమాజం సహకారంతో అక్కడ మహిళల్లో చైతన్యం తీసుకొని రావడానికి కార్యాచరణ రూపొందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments