బిడ్డలను కంటే రూ.62 లక్షలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ..

ఠాగూర్
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (09:09 IST)
ప్రపంచంలోని పలు దేశాల్లో జననాల రేటు గణనీయంగా పడిపోతుంది. ఇప్పటికే చైనా దేశంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. దీంతో చైనా ప్రభుత్వం ఇంతకాలం అమలు చేస్తూ వచ్చిన కుటుంబ నియంత్రణను ఎత్తివేసింది. తమ దేశ పౌరులు ఎంతమందినైనా కనొచ్చని ప్రకటించింది. గతంలో ఒక్కరికి మించి సంతానం కనేందుకు వీలులేదు. కానీ ఇపుడు ఈ నిబంధన ఎత్తివేసింది. ఇలా.. జననాల రేటు పడిపోతున్న దేశాల్లో ఇపుడు దక్షిణ కొరియా కూడా చేరింది. దీంతో ఈ జనన రేటును పెంచుకునేందుకు ఈ దేశానికి చెందిన ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ బూయంగ్ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. 
 
పిల్లల్ని కన్న ప్రతి సారీ రూ.62.54 లక్షలు (100 మిలియన్ కొరియన్ వాన్లు) చెల్లిస్తామని ప్రకటించింది. 2021లో 70 మంది పిల్లకు జన్మనిచ్చిన ఉద్యోగులకూ రూ.43.77 లక్షలు చెల్లించాలని యోచిస్తుంది. ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకు రూ.1.86 కోట్ల లక్షల నగదు లేదా ఇంటి అద్దె సదుపాయాన్ని కల్పించాలని భావిస్తుంది. ఈ ఆఫర్లు ఆడ, మగ ఉద్యోగులిద్దరికీ వర్తిస్తాయని పేర్కొంది. 2022లో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు దక్షిణ కొరియాలోనే నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments