Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేజు ఎయిర్ విమాన ప్రమాదానికి కారణం ఏంటి?

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (14:36 IST)
మరికొన్ని నిమిషాల్లో ల్యాండ్ కావాల్సిన దక్షిణ కొరియాకు చెందిన జేజు విమాన సంస్థకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 179 మంది  ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తు కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఆ విమానం ల్యాండిగ్ గేర్ ఫెయిల్ కావడమేనని ప్రాథమికంగా తేలింది. మరణించిన వారిలో 85 మంది మహిళలున్నారు. విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్‌వేపై జారుతూ వెళ్లిన విమానం రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది. 
 
థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్ 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్‌కు జెజు ఎయిర్‌కు చెందిన విమానం బయలుదేరింది. ఉదయం 9.03 గంటల సమయంలో ముయాన్‌లో దిగుతుండగా విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. దీంతో విమానం రన్‌వే పై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్లింది. 
 
వేగాన్ని నియంత్రించడం సాధ్యం కాలేదు. ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి.. వెంటనే పేలిపోయింది. దీంతో ఇద్దరు మినహా ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. పేలిపోయిన బోయింగ్ 737-800 జెట్ విమానం 15 ఏళ్ల కిందటిది. రన్వేపై విమానం అతి వేగంగా జారిపోతున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. విమానం మొత్తం ధ్వంసమైందని, కేవలం తోక ప్రాంతం మాత్రమే గుర్తుపట్టగలిగేలా ఉందని ముయాన్ అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. 
 
విమానం ప్రమాదానికి గురైన వెంటనే 32 అగ్నిమాపక వాహనాలు, 1,560 మంది సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. తమవారి వివరాల కోసం ముయాన్ విమానాశ్రయానికి బాధితులు భారీగా తరలివచ్చారు. గాయపడి బయటపడిన ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments