Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా నవలా రచయితకు బుకర్ ప్రైజ్

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (12:23 IST)
దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ నవలా రచయితకు ఈ యేడాది ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ వరించింది. ఆ రచయిత పేరు డామన్‌ గాల్గట్‌. ఆయన రచించిన ‘ది ప్రామిస్‌’ నవల ఈ ప్రతిష్టాత్మక పురస్కరానికి ఎంపికైంది. 
 
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సాహిత్య అవార్డుల్లో ఒకటైన బుకర్‌ ప్రైజ్‌ కోసం ఇంతకు ముందు 2003, 2010లోనూ ఆయన రచనలు షార్ట్‌లిస్ట్‌ అయ్యాయి. ఈ ఏడాది బుకర్‌ప్రైజ్ రేసులో అమెరికన్‌ రచయితలు మరోసారి ఆధిపత్యం చెలాయించారు.
 
ఫైనలిస్ట్‌లో ముగ్గురు రచయితలు రిచర్డ్ పవర్స్ (బివిల్డర్‌మెంట్‌), మ్యాగీ షిప్‌స్టెడ్ (గ్రేట్ సర్కిల్‌) ప్యాట్రిసియా లాక్‌వుడ్ (నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్)తో పాటు శ్రీలంక రచయిత అనుక్‌ అరుద్‌ ప్రసంగం (ఏ పాసేజ్‌ నార్త్‌), బ్రిటీష్ అండ్‌ సోమాలి నవలా రచయిత నదిఫా మొహమ్మద్ (ది ఫార్చ్యూన్ మెన్) రచనలు బుకర్‌ప్రైజ్‌ కోసం పోటీపడ్డాయి.
 
అయితే, న్యాయనిర్ణేతలు మాత్రం ‘ది ప్రామిస్‌’ నవలపై ప్రశంసలు కురిపించగా.. ఈ సందర్భంగా అవార్డుకు ఎంపికవడంపై డామన్‌ గల్గట్‌ హర్షం వ్యక్తం చేశారు. బుకర్‌ ప్రైజ్‌కు ఎంపికడంతో 68వేల డాలర్ల నగదు పారితోషకాన్ని డామన్‌ అందుకోనున్నారు. గతేడాది స్కాట్‌లాండ్‌కు చెందిన రచయిత డాగ్లస్ స్టువర్ట్​ ‘బుకర్ ప్రైజ్-​2020’ అందుకున్నారు. ఆయన రచించిన ‘షగ్గీ బైన్’’ అనే నవల అవార్డుకు ఎంపికైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments