Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశంలో 20 యేళ్ల తర్వాత మహిళకు ఉరిశిక్ష- నేడు అమలు

Webdunia
బుధవారం, 26 జులై 2023 (10:16 IST)
సింగపూర్ దేశంలో 20 యేళ్ళ తర్వాత ఓ మహిళకు ఉరిశిక్షను బుధవారం అమలు చేయనున్నారు. నిజానికి ఈ దేశ చట్టాలు అత్యంత కఠినం. 15 గ్రాముల కంటే ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ రవాణా చేస్తే మరణ శిక్షే విధిస్తారు. ఈ క్రమంలో 30 గ్రాముల హెరాయిన్‌తో పట్టుబడిన సారిదేవి దామని అనే మహిళకు కోర్టు గత 2018లో ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను జూలై 26వ తేదీన అమలు చేయనున్నారు. 
 
సారిదేవి దామని అనే 45యేళ్ల మహిళ 30 గ్రాముల హెరాయిన్ రవాణా చేసినట్టు సింగపూర్ పోలీసుల అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలింది. దీంతో ఆమెకు సింగపూర్ కోర్టు ఉరిశిక్షను విధించింది. ఈ శిక్షను బుధవారం అమలుచేస్తున్నారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. సింగపూర్‌లో హక్కులపై పోరాటం చేసే ట్రాన్స్ ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ అనే సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.
 
ఆ డబ్బు ఏం చేశావ్ అంటూ నా భార్య ప్రశ్నిస్తుంది : వైకాపా ఎమ్మెల్యే 
 
అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బంతా ఏం చేశావంటూ నా భార్య ప్రశ్నిస్తుందని, ఇపుడు నా భార్యకు ఏం సమాధానం చెప్పాలని వైకాపా వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తన పాదయాత్రలో వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు రాజకీయాల్లో అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేశారు. 
 
ఒంగోలులోని వైకాపా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ, "రాజకీయాల్లో నేను అవినీతికి పాల్పడి వందల కోట్లు సంపాదించానని పాదయాత్రలో లోకేశ్‌ ఆరోపించారు. నేను ఆయన ప్రసంగాన్ని చూడలేదు. నా భార్య టీవీలో చూశారు. నువ్వు సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నావని ఆవిడ ప్రశ్నిస్తోంది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. దీంతో మా ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయ"ని వ్యాఖ్యానించారు. 
 
ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. శివప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలన్నారు. తెదేపా కంటే వైకాపా ప్రభుత్వంలోనే గ్రానైట్‌ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments