Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమాని కాళ్లూ చేతులు నాకిన కుక్క... చేతులు-కాళ్లు తీసేశారు...

జంతువులకు విచిత్రమైన జబ్బులుంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు కీటకాలు, పక్షలు తదితర జీవుల నుంచి అంతుచిక్కని వ్యాధులు తగులుకోవడం కూడా మనం చూస్తూ వున్నాం. అలాంటి దురృష్టకర సంఘటన అమెరికాలో జరిగింది. తన పెంపుడు కుక్క ఎప్పటిలాగే అతడి చేతులు, కాళ్లూ న

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (20:10 IST)
జంతువులకు విచిత్రమైన జబ్బులుంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు కీటకాలు, పక్షలు తదితర జీవుల నుంచి అంతుచిక్కని వ్యాధులు తగులుకోవడం కూడా మనం చూస్తూ వున్నాం. అలాంటి దురృష్టకర సంఘటన అమెరికాలో జరిగింది. తన పెంపుడు కుక్క ఎప్పటిలాగే అతడి చేతులు, కాళ్లూ నాకింది. కొద్దిరోజులకే అతడికి తీవ్రమైన జ్వరం, అంతుచిక్కని వ్యాధి తగులుకుంది.
 
మరిన్ని వివరాలను చూస్తే...  అమెరికాలోని విస్‌కాన్సిస్‌లో నివాసముంటున్న 48 ఏళ్ల గ్రెగ్ మాంటెఫెల్ జూన్‌ నెలలో ఫ్లూ జ్వరంతో బాధపడ్డాడు. ఆ జ్వరం మరింత వేధిస్తుండటంతో సమీపంలోని మిల్వాకీ ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడు అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. అతడి కాళ్లూ చేతులను కుక్క నాకడంతో అరుదైన అంటువ్యాధి సోకిందని తేల్చారు. 
 
ఈ ఇన్ఫెక్షన్ను అలాగే వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం ఏర్పడవచ్చని వైద్యులు చెప్పడంతో శస్త్రచికిత్సకు అంగీకరించాడు బాధితుడు. ఇన్ఫెక్షన్ అతడి కాళ్లూచేతులకు సోకడంతో వాటిని తొలగించారు. ఇంకా ముక్కుకి కూడా సోకిందని తేలడంతో ముక్కుకి శస్త్ర చికిత్స చేశారు. ఇలా అతడికి మొత్తం ఏడు సర్జరీలు చేసారు. అయినప్పటికీ అతడు ఎంతో ధైర్యంతో వున్నాడు. కాగా కుక్క ద్వారా అంటుకున్న ఈ వ్యాధి చాలా అరుదైనదనీ, కాబట్టి పెంపుడు జంతువులు సాకేవారు ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం