Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా భయం భయం... భారత్-పాక్ మధ్య అణుయుద్ధం వస్తుందేమో?

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ వుంటుంది. ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుని పరిస్థితులు తెలుసుకుంటూ వుంటుంది. ముఖ్యంగా భారతదేశం వైఖరి ఎలా వుందన్నది ఆ దేశానికి చాలా ముఖ్యమని వేరే చెప్

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (20:34 IST)
ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ వుంటుంది. ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుని పరిస్థితులు తెలుసుకుంటూ వుంటుంది. ముఖ్యంగా భారతదేశం వైఖరి ఎలా వుందన్నది ఆ దేశానికి చాలా ముఖ్యమని వేరే చెప్పక్కర్లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి సహనం చాలా ఎక్కువ. అలాంటి దేశానికి కోపమొస్తే... బాబోయ్ చాలా ప్రమాదమని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ జోసఫ్ వోటెల్ అభిప్రాయపడ్డారు. 
 
భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం అణుదాడులకు దారితీసే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశాల స్థితిగతుల గురించి అమెరికా సెనేట్ ఆర్మ్ డ్ సర్వీసెస్ కమిటీకి ఆయన ఓ నివేదిక ఇచ్చారు. ఇందులో భారత్-పాకిస్థాన్‌ దేశాల మధ్య పరిస్థితులు ఎలా వున్నాయో, ఎలాంటి ఉపద్రవం రావచ్చో కూలంకషంగా వివరించారు. 
 
పాక్ భూభాగం నుంచి ఉగ్రవాదులు దాడులకు తెగబడటాన్ని భారతదేశం ఎంతోకాలంగా ఓర్చుకుంటోందనీ, ఆ ఓర్పు హద్దులు దాటితే మాత్రం భారతదేశం ఇక ఎంతమాత్రం ఉపేక్షించదనీ, పాకిస్తాన్ దేశంపైన చర్యలు తీసుకునే అవకాశం వుందనీ, ఇది అణుయుద్ధానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments