Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై హత్యాయత్నం- video

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (13:04 IST)
జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై శుక్రవారం హత్యాయత్నం జరిగింది. ఆయన ఓ మీటింగ్‌లో ప్రసంగిస్తుండగా, ఆయన వెనుక నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. నారా నగరంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మాజీ ప్రధానికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆయన కార్డియోపల్మోనరీ అరెస్ట్‌లో ఉన్నట్టు వైద్యులు వెల్లడిచారు. పైగా, ఆయన్ను ఆస్పత్రికి తరలించే సమయంలోనే స్పృహలో లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అబేపై వెనుక నుంచి రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. 
 
ఈయన యమాటో సైదాయిజి స్టేషనులో ప్రసంగిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. స్థానిక కాలమానం ప్రకరాం ఉదయం 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అబేపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసి అతనివద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నారా నగరానికి చెందిన 41 యేళ్ల టెట్‌సుయా యమగామిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments