Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ వెబ్ సైట్లపై సైబర్ అటాక్.. ఇండియన్ హ్యాకర్ల పనేనట...

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాకిస్థాన్‌కు చెందిన 500 వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. అందులో పాకిస్థాన్ సర్కారుకు చెందిన పలు ప్రధాన వెబ్ సైట్లు కూడా వున్నాయి. అంతేగాకుండా హ్యాక్ చేసిన వెబ్ సైట్లలో భారత్‌ను

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (09:45 IST)
స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాకిస్థాన్‌కు చెందిన 500 వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. అందులో పాకిస్థాన్ సర్కారుకు చెందిన పలు ప్రధాన వెబ్ సైట్లు కూడా వున్నాయి. అంతేగాకుండా హ్యాక్ చేసిన వెబ్ సైట్లలో భారత్‌ను కీర్తిస్తూ పోస్టులు పెట్టారు. కొన్ని వెబ్ సైట్లను వేగంగా పునరుధ్ధరించినప్పటికీ.. పునరుద్ధరణ జరగని సైట్లలో వెబ్ సైట్ అండర్ మెయింటెనెన్స్‌... విల్ బి బ్యాక్ సూన్... సారీ ఫర్ ది ఇన్ కన్వీనియెన్స్.. అంటూ సందేశాలు కనిపిస్తున్నాయి. 
 
లూలూసెక్ ఇండియా అని పిలువబడే హ్యాకర్ల బృందం పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశానికి చుక్కలు చూపించినట్లు పాకిస్థాన్ ఐటీ శాఖాధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మధ్య కాలంలో భారత వైబ్ సైట్లపై దాడి చేసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నించడం...ఆ వెంటనే భారత హ్యాకర్లు ప్రతీకార చర్యలకు దిగడం వెంటవెంటనే జరిగిపోతున్నాయి. 
 
పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ, జలవనరులు-విద్యుత్ శాఖ, వంటి పలు మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్ సైట్లపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments