Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీ కొత్త చట్టం: ఎలాంటి ఆంక్షల్లేకుండా విదేశాలకు మహిళలు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (08:11 IST)
సౌదీలో మహిళల పట్ల తీవ్రంగా ఉంటాయి. అయితే వాటిని ఆ ప్రభుత్వం మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తోంది. మహిళా సాధికారత, వారి హక్కుల కోసం సంస్కరణలు తీసుకువస్తోంది. పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

21 ఏళ్లు నిండిన మహిళలు పురుషుల అనుమతి లేకుండానే పాస్ పోర్టు పొందేందుకు అవకాశం కల్పిచింది. తాజాగా వారు ఎటువంటి ఆంక్షలు లేకుండా విదేశాలకు కూడా వెళ్లేందుకు  కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
 
ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా సౌదీలో మహిళలపై ఆంక్షలు ఉండేవి. గార్డియన్‌షిప్‌ చట్టం ప్రకారం.. మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.  సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఈ చట్టంలో సంస్కరణలు తీసుకురావడం ప్రారంభించారు.

ఆంక్షలన్నింటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది నుంచి మహిళలు డ్రైవింగ్ చేసేందుకు కూడా ఆంక్షలు ఎత్తివేసింది. ఇప్పుడు మహిళలు విదేశీ ప్రయాణం చేయడానికి వీలుగా కొత్త చట్టం తీసుకువచ్చారు. దీంతో సౌదీ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments