Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయిట్ లాస్‌ ఆపరేషన్ చేయించుకుందనీ.. విడాకులిచ్చిన భర్త...

Webdunia
శనివారం, 28 మే 2016 (09:54 IST)
సౌదీ అరేబియాలో ఇటీవల కాలంలో విడాకుల తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే కొన్ని జంటలు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు వింటే మాత్రం ముక్కువ వేలేసుకోవాల్సిందే. మొన్నటికి మొన్న శోభనం రాత్రి తనను పట్టించుకోకుండా ఫోన్‌ మాట్లాండిదన్న కోపంతో పెళ్లయిన కొన్నిగంటలకే భార్యకు విడాకులిచ్చాడో భర్త. తాజాగా ఇలాంటి ఘటనే ఇంకొకటి చోటుచేసుకుంది. భార్య అత్యధికంగా డబ్బులు ఖర్చుపెట్టి వెయిట్ లాస్ ఆపరేషన్‌ చేయించుకుందని.. ఆమెకు విడాకులిచ్చాడు మరో భర్త. 
 
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే... సౌదీ రాజధాని రియాద్‌కు చెందిన ఓ వ్యక్తి... తన భార్య లావుగా ఉండటంతో బరువు తగ్గాలని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి వృత్తిరీత్యా నజ్రాన్‌ ప్రాంతానికి వెళ్లాడు. అయితే భర్త తిరిగొచ్చే సరికి నాజూగ్గా, అందంగా కన్పించాలని భార్య నిశ్చయించుకుంది. దీని ప్రకారమే ఓ వైద్యుడిని సంప్రదించి అతని సలహా ప్రకారమే బరువు తగ్గేందుకు ఆపరేషన్‌ చేయించుకుంది. ఇందుకు అయిన ఖర్చు ఎంతో తెలుసా.... అక్షరాల 80 వేల రియాల్స్‌ (భారత కరెన్సీలో దాదాపు రూ.14 లక్షలు).
 
కొద్ది రోజుల తర్వాత తిరిగొచ్చిన ఆ వ్యక్తి భార్యను చూడగానే ఉబ్బితబ్బిబైపోయాడు. అయితే.. అందుకైన ఖర్చు వివరాలు చెప్పేసరికి ఆగ్రహానికి గురయ్యాడు. ఇంటి కోసం దాచిపెట్టిన డబ్బును ఆపరేషన్‌ కోసం ఖర్చు చేస్తావా... అంటూ కోపంతో ఊగిపోయాడు.... వెంటనే ఆమెకు విడాకులిచ్చేశాడు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments