Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితాంతం గుర్తుండాలని పెళ్లి వేదిక వద్దకు పెళ్ళికొడుకు ఎలా వచ్చాడో తెలుసా (Video)

ప్రతి ఒక్కరూ తమ జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి జరగాలని కోరుకుంటారు. ఇందుకోసం పెళ్లికి ముందునుంచే అనేక ప్లాన్స్ వేసుకుంటుంటారు. అతిథులు, వారికి వడ్డించాల్సిన భోజనాలు, డెకరేషన్.. ఇలా ఒకటేమిటి... అన్న

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (12:50 IST)
ప్రతి ఒక్కరూ తమ జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి జరగాలని కోరుకుంటారు. ఇందుకోసం పెళ్లికి ముందునుంచే అనేక ప్లాన్స్ వేసుకుంటుంటారు.  అతిథులు, వారికి వడ్డించాల్సిన భోజనాలు, డెకరేషన్.. ఇలా ఒకటేమిటి... అన్నింటినీ ముందే ఊహించుకుని మురిసిపోతుంటారు. అలాగే, వివాహం జరిగే కళ్యాణం మండపాల వద్దకు కార్లు లేదా గుర్రాలు, గుర్రపుబగ్గీలపై వస్తారు. 
 
కానీ, సౌదీలోని జౌఫ్ అనే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పెళ్లిని తనకే కాకుండా.. అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కొత్తగా ఆలోచించాడు. పెళ్లి కొడుకు కోసం పెళ్లి వేదిక వద్ద స్నేహితులు బంధువులు అంతా ఎదురు చూస్తున్నారు. పెళ్లి కొడుకును పెళ్లి పందిరి వద్దకు తీసుకెళ్లేందుకు సమయం కావస్తోందని అందరూ ఆందోళన చెందుతున్నారు. 
 
ఇంతలో ఉన్నట్టుండి ఓ కారు వచ్చి ఆగింది. దాంట్లో నుంచి వరుడు దిగుతాడనుకుంటే దిగలేదు. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత మరో భారీ ట్రక్కు వచ్చి ఆగింది. దాంట్లో నుంచి పెళ్లి కొడుకు దిగడంతో అంతా అవాక్కయ్యారు. ఈ దృశ్యం చూడగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అంతా తేరుకుని సరదగా కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూడండి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments