Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్య నాదెళ్ల అరుదైన రికార్డ్..! వార్షిక వేతనం రూ. 525 కోట్లు..!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (13:10 IST)
సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామిగా వెలుగుతున్న మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల అరుదైన రికార్డును సాధించారు. ప్రపంచంలోనే ఎక్కువ జీతాలు అందుకుంటున్న వారిలో మొదటిస్థానంలో నిలిచారు.  ఆయన వార్షిక వేతనం రూ. 525 కోట్లు పొందుతూ ప్రపంచ కార్పొరేట్ రంగంలోనే అత్యధిక వార్షిక వేతనం అందుకుంటున్న సీఈఓ‌గా రికార్డుకెక్కారు. 
 
ఆయన సీఈఓ పదవి పగ్గాలు పట్టి రెండేళ్లు కూడా గడవకముందే ఈ ఘనతను సాధించడం గమనార్హం. ప్రస్తుతం సత్య నాదెళ్ల వార్షిక వేతనం 84.3 మిలియన్ డాలర్లకు చేరింది. అది భారత కరెన్సీలో చూస్తే అక్షరాల రూ.525 కోట్లు. 
 
కాగా గతేడాది ఈ జాబితాలో ఒరాకిల్ సీఈఓ లారీ ఎల్లిసన్ ఉండగా, తాజాగా సత్య నాదెళ్ల ఆయన స్థానాన్ని ఆక్రమించారు. ఇక తాజా జాబితాలో భారత సంతతి మహిళ, పెప్సీకో సీఈఓ ఇంద్రా నూయీ 19.08 మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో 19వ స్థానంలో నిలిచారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments