Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నుంచి నోయిడా.. చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్‌సంగ్

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (12:53 IST)
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. అక్కడ నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను ఉత్తరప్రదేశ్‍‌లోని నోయిడాకు తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శామ్‌సంగ్ సంస్థ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈఓ కెన్ కాంగ్ నేతృత్వంలోని శామ్‌సంగ్ ప్రతినిధి బృందం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసింది. 
 
మెరుగైన పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడిదారుల-స్నేహపూర్వక విధానాల కారణంగా.. చైనాలో ఉన్న డిస్ ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నోయిడాలో ఏర్పాటు చేయాలని శామ్ సంగ్ నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రతినిధి బృందం తెలిపింది.
 
ఈ నిర్మాణ పనుల వల్ల భారతదేశం పట్ల తమ నిబద్ధతను తెలియజేస్తుందని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలని ప్రతినిధి బృందం తెలిపింది. నోయిడాలో శామ్‌సంగ్ నిర్మించనున్న కర్మాగారం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయానికి ఒక ఉత్తమ ఉదాహరణ అని సీఎం యోగి అన్నారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. భవిష్యత్తులోనూ శామ్‌సంగ్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సాయం కొనసాగిస్తుందని ప్రతినిధి బృందానికి సీఎం యోగి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments