Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామ్‌సంగ్ అధినేత లీజే యాంగ్‌కి చిప్పకూడు తప్పదా?

అభిశంసనకు గురైన దేశాధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైతో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌కి అధినేత లీజే యాంగ్‌కి జైలు తప్పేలా లేదు. అధికారి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (15:31 IST)
అభిశంసనకు గురైన దేశాధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైతో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌కి అధినేత లీజే యాంగ్‌కి జైలు తప్పేలా లేదు. అధికారికంగా సామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవిలో ఉన్న లీ ని గతవారం అధికారులు 22 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుకు వారంట్‌ జారీ చేయాల్సిందిగా విచారణాధికారులు స్థానిక కోర్టును కోరినట్లు తెలుస్తోంది. వీరి దరఖాస్తును న్యాయస్థానం బుధవారం పరిశీలించనుంది.
 
అధ్యక్షురాలి సన్నిహితులకు లంచంగా సంస్థ డబ్బు ఇవ్వమని లీ తన ఎగ్జిక్యూటివ్స్‌కి తెలిపాడని విచారణలో తేలింది. 'జాతీయ ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యం.. న్యాయాన్ని కాపాడడం అంతకన్నా ముఖ్యం..' అని స్వతంత్ర విచారణ సంస్థ అధికార ప్రతినిధి లీ క్యూ చుల్‌ వెల్లడించారు. ఇప్పటికే లీని అదుపులోకి తీసుకోవడానికి అనుమతులు పొందినట్లు సమాచారం. మరోవైపు దర్యాప్తును వేగవంతం చేసి ఛార్జీషీటు దాఖలు చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నట్లు క్యూ చుల్ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments