అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
మంగళవారం, 29 జులై 2025 (18:38 IST)
అమెరికాలో భారత సంతతికి చెందిన కోపైలెట్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. చేతులకు బేడీలు వేసి మరీ తీసుకెళ్లారు. అతని పేరు రుస్తు భగ్వాగర్. భారత సంతతి కోపైలెట్. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో అతడిని కాక్‌పిట్ నుంచే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఆయన డెల్టా ఎయిర్‌లైన్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 
 
డెల్టా సంస్థకు చెందిన బోయింగ్ విమానం మిన్నియాపోలీస్ నుంచి బయలుదేరి శాన్‌ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అయింది. విమానం ఆగిన వెంటనే పోలీసులు కాక్‌పిట్‌లోకి దూసుకొచ్చి భగ్వాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హఠాత్ పరిణామానికి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారు. పైగా కో పైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం గమనార్హం. 
 
భగ్వాగర్ తప్పించుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు... ఎంతో గోప్యంగా ఈ అరెస్టు ప్రక్రియను పూర్తి చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఈ యేడాది ఏప్రిల్ నుంచి విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం అతడిని అరెస్టు చేశారు. డెల్టా సంస్థ ఈ అరెస్టుపై స్పందించింది. అనైతిక ప్రవర్తనను తమ సంస్థ ఏమాత్రం సహించదని, అతడిపై వచ్చిన అభియోగాలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని పేర్కొంది. ఆ కోపైలెట్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం