Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ సంస్థకు రూ.4 వేల విరాళం.. 12 యేళ్ల జైలుశిక్ష

ఠాగూర్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (09:31 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య గత కొంతకాలంగా యుద్ధం సాగుతుంది. ఇందులోభాగంగా, ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు. రష్యా సైన్యం చేసిన దాడుల్లో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థకు కరేలీనా అనే డ్యాన్సర్ విరాళం ఇచ్చింది. దీన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది. విరాళం ఇచ్చిన డ్యాన్సర్‌కు ఏకంగా 12 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికా - రష్యన్ పౌరురాలు అయిన క్సేనియా కరేలీనా (32) అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఉంటుంది. ఆమె ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహరించే ఓ స్వచ్ఛంద సంస్థకు ఆమె 50 డాలర్లకుపైగా విరాళం ఇచ్చింది. ఈ విషయాన్ని రష్యా చాలా తీవ్రంగా పరిగణించింది. గత జనవరిలో రష్యాలోని యెకాటెరిన్ బర్గ్‌లో ఉన్న తన కుటుంబాన్ని సందర్శించేందుకు కరేలీనా రష్యాకు వచ్చింది. 
 
ఆ వెంటనే రష్యన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహానికి పాల్పడిందంటూ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అరెస్టు చేయడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పౌరులను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేస్తున్నారని విమర్శించింది. ఆమెను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ... అమెరికా సఫలీకృతం కాలేదు. కోర్టులో కేసు విచారణ సందర్భంగా కరేలీనా నేరాన్ని అంగీకరించిందని రష్యన్ మీడియా తెలిపింది. కరేలీనా దేశద్రోహానికి పాల్పడిందని కోర్టు నిర్ధారించింది. ఆమెకు కోర్టు 12 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments