అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు సిరియా.. చిన్నారులు కన్నీళ్లు, రక్తపు మరకలతో?

సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అజాద్‌ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారుల మధ్య పోరాటం జరుగుతోంది. సిరియాలో ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరు ఉధృతమైంది. ఈ క్రమంలో సిరియాలో జరుగుతున్న

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:03 IST)
సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అజాద్‌ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారుల మధ్య పోరాటం జరుగుతోంది. సిరియాలో ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరు ఉధృతమైంది. ఈ క్రమంలో సిరియాలో జరుగుతున్న సైనిక పోరు కారణంగా గత తొమ్మిది రోజుల్లో 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
సిరియాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంటున్నా.. భారత్‌లో సినీనటి శ్రీదేవి మరణంపై మీడియా మొత్తం ఫోకస్ చేస్తోంది. ఏం జరుగుతుందో తెలియక ఆడుకునే చిన్నారులు.. సిరియాలో బాంబుల మోత వింటున్నారు. రక్తమోడే వీధులను చూస్తున్నారు. సిరియాలో చోటుచేసుకున్న ఈ విషాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వీటిపై సెలెబ్రిటీలు తమ పోస్టుల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ హాస్యనటుడు వివేక్ తన ట్విట్టర్ పేజీలో చిన్నారులు కన్నీళ్లతో రక్తపు మరకలను చూస్తే గుండె తరుక్కుపోతోంది. అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు సిరియా.. చనిపోయేది.. చిన్నారులు మాత్రమే.. అంటూ వివేక్ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. సిరియాలో జరుగుతున్న యుద్ధ సన్నివేశాలను చూపెట్టేందుకు.. రష్యా ఛానల్ వీడియో గేమ్ ఫుటేజీలను వాడుతుంది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భయానక సంఘటనలు చోటుచేసుకుంటున్న సిరియా యుద్ధానికి వీడియో గేమ్‌ల ఫుటేజీని వాడటం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments