Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో కరోనా విజృంభణ.. కోవిడ్ వ్యాక్సిన్ రెడీ.. సెప్టెంబరులో అందుబాటులోకి..

Webdunia
శనివారం, 16 మే 2020 (13:56 IST)
Russia
రష్యాలో కరోనా రక్కసి విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యం అమెరికా తర్వాత రష్యాలోనే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. శనివారం కొత్తగా 9,200 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,72,043కు పెరిగింది. 
 
మాస్కో నగరం కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారింది. మొత్తం కేసుల్లో సగానికిపైగా మాస్కోలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 119 మంది చనిపోయారు. శనివారం వరకు రష్యాలో 2,537 మంది మరణించారు. 60శాతానికి పైగా కరోనా మరణాలు మాస్కోలోనే సంభవించాయి.
 
ఇదిలా ఉంటే.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కోవిడ్‌పై వ్యాక్సిన్‌కు పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిపై ప్రొఫెసర్‌ అడ్రియాన్‌ హిల్ మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్‌ ఖరీదు తక్కువే ఉంటుందన్నారు. ఇది సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌. గ్లోబల్‌ సప్లై చైన్‌కి అందుబాటులో ఉంటుంది. 
 
ఇప్పటికే 10 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని.. సెప్టెంబరు నాటికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. ChAdOx1 nCoV-19 పేరిట ఆక్స్‌ఫర్డ్‌ రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌పైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశలు నెలకొన్నాయి.
 
ChAdOx1 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఏడు తయారీ కేంద్రాలకు ఉందని హిల్‌ తెలిపారు. వాటిలో ఇండియాలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కూడా వుండటం విశేషం. ఈ సంస్థ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పరిశోధనల్లో క్రీయాశీలకంగా పాల్గొంటోంది. మరిన్ని కేంద్రాలు చైనా, ఐరోపా దేశాల్లో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments