Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లోకి చొరబడిన రష్యా... ఎయిర్‌బేస్‌లు ధ్వంసం

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:03 IST)
అందరూ ఊహించినట్టుగానే ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన రష్యా.. ఆ ప్రాంతాల్లోకి తొలుత ప్రవేశించింది. అక్కడ నుంచి ఉక్రెయిన్‌ దేశంలోకి చొరబడి, భీకర దాడులకు దిగింది. ఇందులోభాగంగా, ఉక్రెయిన్‌లోని ఎయిర్‌బేస్‌లతో పాటు గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌లో ప్రజలు ప్రాణాలను గుప్పెట పెట్టుకుని జీవిస్తున్నారు. 
 
యుద్ధం ఆరంభంకావడంతో ఉక్రెయిన్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొందరు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు, ఉక్రెయిన్ సైన్యం ఏమాత్రం బెదరకుండా తమ దేశాన్ని, తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు తన శక్తిమేరకు పోరాడుతుంది. ఇందులోభాగంగా రష్యాకు చెందిన అనేక యుద్ధ విమానాలను ధ్వసం చేసింది. 
 
మరోవైపు, ఉక్రెయిన్‌లోని ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించడంతో ఉక్రెయిన్‌లోని విదేశీ పౌరులు, ప్రతినిధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్టులను కూడా ఉక్రెయిన్ మూసివేసింది. దీంతో ఆ దేశంలోని విదేశీయులు తమ దేశాలకు వెళ్లలేక అక్కడే  చిక్కుకుని పోయారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments