Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్... ప్రపంచాన్ని కాపాడింది: ఆమెరికా శాస్త్రవేత్త

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (11:43 IST)
కరోనా కష్టకాలంలో ప్రపంచాన్ని భారత్ చేస్తున్న మేలును ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ అవతరించిందన్నారు. ముఖ్యంగా, భారత్ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రపంచానికి ఓ బహుమతి అని అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పీటర్ హాట్జ్ చెప్పుకొచ్చారు. 
 
కొవిడ్‌-19పై ఇటీవల నిర్వహించిన వెబినార్‌లో పీటర్‌ మాట్లాడుతూ.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా భారత్‌ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడిందన్నారు. భారత్‌ భాగస్వామ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదన్నారు. 
 
కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో భారత్‌ ఔషధ రంగంలో తనకున్న అపార అనుభవం, విజ్ఞానంతో ప్రపంచ ఔషధ కేంద్రంగా మారిందని కొనియాడారు. భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ ప్రపంచానికి ఒక బహుమతి అన్నారు. 
 
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌కు చెందిన సీరం సంస్థ తయారు చేస్తుండగా, దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ఐసీఎంఆర్‌తో కలిసి కొవాగ్జిన్‌ను తయారు చేసిందని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments