Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న భారత్ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (10:32 IST)
భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అమెరికా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఇది బియ్యం వ్యాపారుల పాలిట వరంగా మారింది. ముఖ్యంగా, అమెరికాలో ఈ బియ్యం కొరత ఏర్పడటంతో డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది అమెరికా వ్యాపారులపై కాసుల వర్షం కురుస్తోంది. 
 
ఇప్పటికే బియ్యం బస్తాలను జనాలు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ బియ్యం ధరలను రెట్టింపు చేశాయి. భవిష్యత్తులో ఇతర రకాల బియ్యంపై నిషేధం విధించొచ్చన్న ఊహగానాల నడుమ రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇప్పటి నుంచే బాస్మతీ బియ్యం కొనుగోళ్లు పెంచినట్టు సమాచారం.
 
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల కొరత తీవ్రమవుతోంది. దీనికితోడు భారత్ నిర్ణయం పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments