Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీస్ శిక్షణా శిబిరంపై దాడి.. 60 మంది హతం

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణాశిబిరంపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 59 మంది వరకు పోలీసులు హతమయ్యారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాక

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (10:09 IST)
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణాశిబిరంపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 59 మంది వరకు పోలీసులు హతమయ్యారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడికి పాల్పడినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. 
 
ఉగ్రవాదులు ముందుగా వాచ్‌ టవర్‌ సెంట్రీని లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించారనీ, ఆ తర్వాత శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పేర్కొంది. ఈ దాడి సమయంలో పోలీసుల శిక్షణా శిబిరంలో 600 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా, కొంతమంది పోలీసులు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లు పాక్ మీడియా ప్రకటించింది. నిషిద్ధ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉండే లష్కరే, ఇతర ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments