Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వీలునామాను తెరవరాదు.. 90 ఏళ్ల పాటు రహస్యంగా వుంచాలి

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (11:16 IST)
బ్రిటీష్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు చెందిన వీలునామాను మరో 90 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాలంటూ గురువారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. క్వీన్ ఎలిజబెత్ హుందాతనానికి సూచకంగా ఆ వీలునామాను తెరవరాదు అని హైకోర్టు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 99 ఏళ్ల వయసులో ప్రిన్స్ ఫిలిప్ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 
 
రాచరిక కుటుంబంలో ఎవరైనా సీనియర్ సభ్యులు మరణిస్తే, వారికి చెందిన వీలునామాపై హైకోర్టులో ఉన్న ఫ్యామిలీ డివిజన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని శతాబ్ధాల నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది.
 
ప్రస్తుతం ఫ్యామిలీ డివిజన్ కోర్టు అధ్యక్షుడిగా ఉన్న సర్ ఆండ్రూ మెక్ ఫార్లేన్ .. ప్రిన్స్ ఫిలిప్ వీలునామాపై తీర్పును ప్రకటించారు. ఫిలిప్ వీలునామాను సీలు చేసి, 90 ఏళ్లు తర్వాత దాన్ని తెరవాలంటూ మెక్‌ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. ప్రిన్స్ ఫిలిప్ తన వీలునామాలో ఏం రాశారో ఎవరికీ తెలియదని జడ్జి తెలిపారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments