Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెలెన్ స్కీకి ప్రధాని మోదీ థ్యాంక్స్.. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని..?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (15:54 IST)
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్ సందర్భంగా ఫిబ్రవరి 26న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌ స్కీతోమాట్లాడారు. తాజాగా సోమవారం కూడా మోదీ జెలెన్ స్కీతో మాట్లాడారు.  
 
ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌కు భారతదేశం గైర్హాజరైన తర్వాత, జెలెన్స్‌కీ ప్రధాని మోదీతో సంభాషించడమే కాక భారతదేశ రాజకీయ మద్దతును కూడా కోరారు. 
 
ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాదు భారతీయ పౌరులను సురక్షితంగా నిష్క్రమించడానికి ఇప్పటికే ఉక్రెయిన్‌ను భారత్‌ సంప్రదించింది కూడా. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జెలెన్ స్కీకి కృతజ్ఞతలు తెలిపారు. రష్యా వల్ల ఉక్రెయిన్‌లో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ఫోన్‌లో మాట్లాడారు. 
 
యుక్రెయిన్ లో ఘర్షణ పరిస్థితులు, యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న చర్చల గురించి జెలెన్ స్కీ ప్రధాని మోదీకి వివరించారు. 
 
హింసను తక్షణమే నిలిపివేయాలని పునరుద్ఘాటించిన మోదీ… శాంతియుతంగా చర్చల ద్వారా రెండు దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలని జెలెన్ స్కీకి సూచించారు. 
 
యుక్రెయిన్ నుండి 20 వేల మందికి పైగా భారతీయ పౌరులను తరలించడానికి సహకరించిన ఉక్రెయిన్ అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. 
 
యుక్రెయిన్‌లో ఇంకా మిగిలి ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత రక్షణ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మోదీ… ఉక్రెయిన్‌లో మిగిలి ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించాలని జెలెన్స్‌కి‌ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments