Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌కు డోనాల్డ్ ట్రంప్ ఊరట.. ముస్లిం దేశాల వలసలపై మార్పులతో నిషేధం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాక్‌కు స్వల్ప ఊరటనిచ్చారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసి ఇంటాబయట విమర్శలు కొనితెచ్చుకున్నారు

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (09:34 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాక్‌కు స్వల్ప ఊరటనిచ్చారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసి ఇంటాబయట విమర్శలు కొనితెచ్చుకున్నారు. కోర్టులతోనూ మొట్టికాయలు వేయించుకున్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోని ట్రంప్ పాత ఆదేశాలకు కొద్దిపాటి మార్పులు చేసి కొత్తగా కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్) ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ తాజా ఆదేశాల మేరకు... గతంలో ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై నిషేధం విధించగా ఈసారి ఆ జాబితా నుంచి ఇరాక్‌ను మినహాయించి సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమన్ దేశాలకు పరిమితం చేశారు. తాజా ఆదేశం ప్రకారం ఈ ఆరు దేశాల నుంచి మూడు నెలలపాటు వలసలపై నిషేధం ఉంటుంది. 
 
అలాగే శరణార్థులను కూడా 120 రోజులపాటు దేశంలోకి అనుమతించరు. అయితే అనుమతి పొందిన వారికి మాత్రం కొన్ని షరతులతో మినహాయింపు ఇస్తారు. గా వలసల నిషేధ దేశం నుంచి తమను మినహాయించడంపై ఇరాక్ హర్షం వ్యక్తం చేసింది. ట్రంప్ తాజా ఆదేశం ఈనెల 16 నుంచి అమల్లోకి రానుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments