Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై వార్తలన్నీ తుస్సే.. అమితాబ్ వద్దన్నారట..

తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడిన తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు హాట్ హాట్‌గా చర్చ సాగింది. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తారని ప్రచారం మొదలైపోయింది. రజనీకాంత్‌ కొత్

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (19:23 IST)
తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడిన తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు హాట్ హాట్‌గా చర్చ సాగింది. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తారని ప్రచారం మొదలైపోయింది. రజనీకాంత్‌ కొత్త పార్టీతో వస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
 
బీజేపీలో టచ్ ఉన్నారని, వీరద్దరి మధ్య ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి సయోధ్య కుదురుస్తున్నారంటూ మీడియో తెగ హడావిడి జరిగిపోయింది. రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తిదేనని.. రజనీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటు అనేది అవాస్తం అని గురుమూర్తి స్పష్టం చేశారు. రజనీకాంత్ బీజేపీతో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న ప్రచారమంతా ఓ కట్టుకథ, అభూత కల్పన అని కొట్టిపారేశారు. మీడియాలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రసారం చేస్తారో అర్థం కావడం లేదని ట్వీట్‌ చేసిన రజనీకాంత్ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు సంక్షోభం ఓ కొలిక్కి రాని పరిస్థితుల్లో పలు ఊహాగానాలు, వదంతులు సామాజిక మాధ్యమాలు, మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఈ వార్తలను నమ్మవద్దని గురుమూర్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తాజాగా, బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తావన వచ్చింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో రజనీకి అమితాబ్ ఓ సలహా ఇచ్చారట. రజనీని క్రియాశీలక రాజకీయాల్లోకి రావొద్దని అమితాబ్ ఫోన్ చేసి మరీ చెప్పారని వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments