Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో రష్యా దౌత్యవేత్త నికొలాయ్ మృతి.. గుండెపోటా?

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (19:35 IST)
Russian diplomat
టర్కీలో రష్యా దౌత్యవేత్త నికొలాయ్ కోబ్రినెట్స్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించి ఉంటారని తొలుత వార్తలు వెలువడినా ఘటనపై లోతైన దర్యాప్తు ప్రారంభం అయ్యింది. 
 
టర్కీలో జరుగుతున్న వివిధ దేశాల రాయబారుల సమావేశంలో పాల్గొనేందుకు నికొలాయ్ కోబ్రినెట్స్ టర్కీ వెళ్లారు. ఇస్తాంబుల్‌లోని ఓ హాటల్‌లో బస చేశారు. 
 
అయితే, ఆయన ఓ మీటింగ్‌కు హాజరుకాని విషయాన్ని గుర్తించిన సహోద్యోగులు ఆయన హోటల్‌కు వెళ్లిచూడగా విగతజీవిగా కనిపించారు. ఈ క్రమంలో, నికొలాయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హోటల్‌, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 
 
ఇటీవల కాలంలో పలువురు రష్యా ప్రముఖులు, సంపన్నుల మరణాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఉక్రెయిన్‌‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచీ దాదాపు 40 మంది ప్రముఖులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments