Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకైనా సరే కాల్చిపారేయండంటున్న దేశాధినేత!

దేశాన్ని నాశనం చేస్తున్న మాదకద్రవ్య ముఠాలను ఫిలిప్పీన్స్ సర్కారు ఏరిపారేస్తోంది. డ్రగ్స్ ముఠాపై ఆ దేశాధ్యక్షుడు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, డ్రగ్స్ ఆరోపణలతో 3,800 మందిని అంతమొందించారు.

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (16:52 IST)
దేశాన్ని నాశనం చేస్తున్న మాదకద్రవ్య ముఠాలను ఫిలిప్పీన్స్ సర్కారు ఏరిపారేస్తోంది. డ్రగ్స్ ముఠాపై ఆ దేశాధ్యక్షుడు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, డ్రగ్స్ ఆరోపణలతో 3,800 మందిని అంతమొందించారు. వీరందరినీ నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు, ఇంకా చంపుతున్నారు. దీంతో అక్కడి ప్రతిపక్షాలు ఆ దేశాధ్యక్షుడి కుమారుడిపై ఆరోపణలు చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తన డ్రగ్స్ ముఠాలో తన కుమారుడు ఉన్నాసరే కాల్చిపారేయండి అంటూ ఆదేశాలు జారీచేశారు. ఆయనే ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టే.
 
నిజానికి ఈయన అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచం మొత్తం వ్యతిరేకించినా ఆయన ఏమాత్రం చలించడం లేదు. డ్రగ్ మాఫియాను అంతమొందించేందుకు తనను అధ్యక్షుడిగా చేయాలని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్ మాఫియా పేరు వినపడితే కాల్చిచంపేయమని, ఏం జరిగినా తర్వాత తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన అధికారం చేపట్టిన అనంతరం 3,800 మంది డ్రగ్ సంబంధాలు కలిగిన వారిని ఎన్‌కౌంటర్ చేశారంటే ఆయన చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి డ్యుటర్టే కుమారుడు డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై డ్యుట్టరే నోరు విప్పారు. ఆరోపణలు నిజమైతే తన కొడుకైనా ఎక్కువ కాదని, అతన్ని కూడా కాల్చిపారేయాలన్నారు. 
 
చైనా డ్రగ్ డీలర్లతో డ్యుటర్టే కుమారుడు చేతులు కలిపి డ్రగ్స్ తీసుకొస్తున్నాడని ప్రతిపక్ష నేత ఆరోపించారు. దానిపై ఆయన వివరిస్తూ, నా పిల్లలకు డ్రగ్‌ మాఫియాతో ఎలాంటి సంబంధాలు లేవని గతంలోనే స్పష్టంగా చెప్పానన్నారు. తాను చెప్పినట్టుకాకుండా ఒకవేళ వారు అక్రమ రవాణాకు పాల్పడితే వారిని పట్టుకుని చంపేయమని సలహా ఇచ్చారు. అలా చేస్తే తనను ఎవరూ వేలెత్తి చూపలేరన్నారు. తన కుమారుడికి కూడా ఈ విషయం చెప్పానని ఆయన అన్నారు. అలా చంపిన పోలీసులకు రక్షణ కూడా కల్పిస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments