Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు శాపంగా మారారు: ముషారఫ్ ఆరోపణ

పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ దేశం పట్ల మోదీ శాపంగా పరిణమించారని ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (11:11 IST)
పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ దేశం పట్ల మోదీ శాపంగా పరిణమించారని ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ వల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ ఏకాకిగా మారుతోందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ సమాజాన్ని దౌత్యపరంగా మోదీ తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్నారని ముషారఫ్ అన్నారు. 
 
నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ గూఢచారి కాదని భారత్ వాదిస్తున్న నేపథ్యంలో.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థ అని మనమెందుకు చెప్పాలని ముషారఫ్ ప్రశ్నించారు. లష్కరే తాయిబా, జమాద్ ఉద్దవాలు దేశ భక్తి గల సంస్థలని ఇటీవలన ముషారఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఈ సంస్థల కార్యకర్తలు దేశం కోసం తమ ప్రాణాలను కూడా అర్పించారని ఆయన అన్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీస్ సయీద్ కు కూడా ఆయన మద్దతు పలికారు. తన హయాంలో పాకిస్థాన్ దౌత్యనీతి దూకుడుగా ఉండేదని.. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు ఏమాత్రమైనా గౌరవం ఉందా? అంటూ ప్రశ్నించారు. పాకిస్థాన్ దౌత్యనీతికి కాలం చెల్లిపోయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments