Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ కార్డు వుంటే చాలు.. ఇక నేపాల్, భూటాన్‌ చుట్టేయవచ్చు...

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (11:58 IST)
దేశంలో ఆధార్ కార్డుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్లు అనుసంధానం అయిన నేపథ్యంలో.. ఆధార్ కార్డుతో నేపాల్, భూటాన్‌కు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చునని కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అన్ని వర్గాల వారికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిన తరుణంలో.. భారతీయులు నేపాల్, భూటాన్ దేశాలకు వీసా లేకుండా ఆధార్ కార్డుతో వెళ్ళొచ్చునని కేంద్రం వెల్లడించింది. 
 
కానీ 15 వయస్సుకు లోబడిన వారు.. 65 ఏళ్లకు మించిన వారికి ఈ ఆఫర్ వుండదని.. కేంద్రం తెలిపింది. వారు భూటాన్, నేపాల్‌లో ప్రయాణించాలనుకుంటే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులను ప్రత్యామ్నాయంగా చూపించాలని కేంద్రం ప్రకటించింది. 
 
కాగా భారత పౌరులందరికీ వయోబేధం లేకుండా ఆధార్ కార్డులను కేంద్రం తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. ఆధార్ కార్డును అన్నింటికి కేంద్రం అనుసంధానం చేసింది. చివరికి సిమ్ కార్డులను పొందేందుకు కూడా ఆధార్ కార్డును అడగటంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 
 
ఇంకా ఆధార్ కార్డు ద్వారా వ్యక్తిగత వివరాలు చోరీకి గురవుతున్నట్లు కూడా విమర్శలొచ్చాయి. ఇలాంటి తరుణంలో ఆధార్ కార్డుతో నేపాల్, భూటాన్ వంటి దేశాలకు వీసా లేకుండా పర్యటించవచ్చునని కేంద్రం ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments