Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపితేనే నిధులిస్తాం : పాక్‌కు అమెరికా షాక్

పాకిస్థాన్‌కు అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. ఉగ్రవాదానికి వంతపాడుతూ వస్తూన్న పాకిస్థాన్ పైకిమాత్రం శ్రీరంగ నీతులు వల్లెవేస్తోంది. పాకిస్థాన్ అండతో పెట్రేగిపోతున్న ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ను

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (13:21 IST)
పాకిస్థాన్‌కు అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. ఉగ్రవాదానికి వంతపాడుతూ వస్తూన్న పాకిస్థాన్ పైకిమాత్రం శ్రీరంగ నీతులు వల్లెవేస్తోంది. పాకిస్థాన్ అండతో పెట్రేగిపోతున్న ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ను అంతం చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటేనే ఆర్థిక సాయం అందిస్తామని అమెరికా తాజాగా తేల్చి చెప్పింది. 
 
అమెరికా ఇటీవల ప్రకటించిన రూ.6,121 కోట్లలో సాయంలో తొలి విడతగా రూ.2.7 వేల కోట్లు అందజేయాల్సి ఉంది. సంకీర్ణ మద్దతు నిధి (సీఎస్ఎఫ్) కింద పాకిస్థాన్‌కు సాయం అందిచించే రక్షణ బిల్లు ఎన్‌డీఏఏ-2017కు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా మద్దతు తెలిపింది. ఏకాభిప్రాయంతో కూడిన బిల్లు కావడంతో తాజాగా ఇది అమెరికా సెనేట్‌లోనూ ఆమోదం పొందింది.
 
అయితే ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్ హక్కానీ నెట్ వర్క్ విషయంలో ఆఫ్ఘనిస్థాన్‌కు సహకరిస్తూ ఉగ్రకార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ సర్టిఫికెట్ ఇస్తేనే ఈ సాయం అందుతుంది. దీంతో 2016కు సంబంధించిన సాయం అందించేందుకు కావాల్సిన సర్టిఫికేట్ ఇచ్చేందుకు అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ నిరాకరించారు. 
 
ఫలితంగా పాకిస్థాన్‌కు అందాల్సిన రూ.2 వేల కోట్ల సాయం నిలిచిపోయింది. తాజాగా సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఎడీఏఏ-2017 బిల్లుపై కూడా రక్షణ మంత్రి సర్టిఫికెట్ ఇస్తేనే అంటూ అమెరికా కాంగ్రెస్ షరతు విధించింది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు కూడా జోక్యం చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో పాకిస్థాన్‌ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments