Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాంతితో తడిసిన సీట్లు... కూర్చోబోమన్న ప్రయాణికులు.. దించేసిన ఎర్ కెనడా సిబ్బంది

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (14:51 IST)
ఇద్దరు ప్రయాణికులకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ కెనడా విమానంలో వారికి ఈ అనుభవం ఎదురైంది. ఎవరో ప్రయాణికులు వాంతి చేసుకోవడంతో సీట్లు తడిసిపోయాయి. ఈ సీట్లలో ఇద్దరు ప్రయాణికులను విమాన సిబ్బంది కూర్చోవాలని సూచించగా, అందుకు ఆ ప్రయాణికులు నిరాకరించారు. సియాటెల్ నుంచి మాంట్రియేల్‌కు వెళ్లే విమానంలో ఈ దారుణ ఘటన జరిగింది. దీని గురించి బాధిత ప్రయాణికులు కాకుండా ఆ విమానంలో ఉన్న మరో ప్రయాణికుడు బెన్సన్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 
 
ఆ ఇద్దరు ప్రయాణికులు కూర్చోవాల్సిన సీట్ల నుంచి దుర్వాసన వచ్చిందని, అదేంటో మొదట తమకు అర్థం కాలేదని బెన్సన్ చెప్పారు. అంతకుముందు ఆ సీట్లలో కూర్చున్న వారెవరో వాంతి చేసుకుని ఉంటారని, దాన్ని కప్పిపుచ్చేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని తెలిపారు. సీట్లు తడిగా ఉండటంతో పాటు వాటి పక్కను వాంతి మరకలు ఉన్నాయని చెప్పారు. వాసన రాకుండా ఉండేందుకు సిబ్బంది అక్కడ సెంటుకొట్టారని ఆ సీట్లలో కూర్చోటానికి వీలులేకుండా ఉండటంతో ఆ ఇద్దరు ప్రయాణికులు తమకు వేరే సీట్లు కేటాయించాలని సిబ్బందిని కోరారు. 
 
తమ సమస్యను మర్యాదగానే చెప్పినా నిక్కచ్చిగా వ్యవహరించారని బెన్సన్ తెలిపారు. కానీ, ఈ విషయంలో తామేమీ చేయలేమని ఫ్లైట్ అటెండెంట్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. మిగతా సీట్లలో ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం మొదలు కావడంతో జోక్యం చేసుకున్న పైలట్ విమానం దిగిపోవాలని ఆ ఇద్దరినీ ఆదేశించాడు. 
 
లేకపోతే మరో విమానంలోనే ప్రయాణించేందుకు వీల్లేకుండా వారిని 'నో ఫ్లై' జాబితాలో చేర్చుతానని బెదిరించాడని తెలిపారు. దీంతో తమకు మరో మార్గం లేకపోవడంతో ఆ ఇద్దరు ప్రయాణికులు విమానం దిగి వెళ్లిపోయారని బెన్సన్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సమీక్ష జరపుతున్నామని ఎయిర్ కెనడా స్పందించింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని అంగీకరించి, విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments