Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మహిళ తలలో పాకుతున్న పేలు... విమానం అత్యవసర ల్యాండింగ్!!

వరుణ్
సోమవారం, 5 ఆగస్టు 2024 (14:58 IST)
సాధారణంగా ఏదేని సాంకేతిక సమస్య ఉత్పన్నమైతేనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. లేదా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ లేదా అత్యవసర వైద్య సాయం అందితేనే సాయం చేస్తారు. కానీ, ఇక్కడ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండటాన్ని గమనించిన మరో మహిళ.. విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. ఈ సంఘటన వినడానికి కాస్త వింతగా, నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ నిజంగా ఈ సంఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న అమెరికా ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని చూసిన ప్రయాణికులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఫినిక్స్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
'విమానాన్ని మళ్లిస్తున్నట్టు మాత్రమే విమాన సిబ్బంది చెప్పడంతో ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. నేను చుట్టూ చూశాను. ఎవరూ భయపడడం లేదు. అయినా విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే ఓ మహిళ విమానం ముందు వైపునకు దూసుకుపోయింది' అని పేర్కొన్నాడు.
 
ఆ తర్వాత విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని తోటి ప్రయాణికుడిని అడిగితే అసలు విషయం తెలిసిందని, ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని ఇద్దరు ప్రయాణికులు చూసి విమాన సిబ్బందికి చెప్పారని పేర్కొన్నారు. వారొచ్చి చూస్తే నిజంగానే ఆమె తలలో పేలు పాకుతున్నాయని వివరించాడు. ఆ తర్వాత విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని చెప్పుకొచ్చాడు. 
 
ఈ ఘటన కారణంగా విమానం 12 గంటలు ఆలస్యమైందని, అప్పటివరకు ప్రయాణికులకు హోటల్లో గదులు ఇచ్చారని వివరించాడు. ఈ విషయాన్ని అమెరికన్ ఎయిర్లైన్స్ కూడా ధ్రువీకరించింది. జూన్ 15న ఈ ఘటన జరిగిందని, ప్రయాణికురాలికి వైద్యసాయం అవసరం కావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments