Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం - 39 మంది వలసదారుల మృతి

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (11:56 IST)
అమెరికాలోని పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో ఏకంగా 39 మంది వలసదారులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 66 మంది ఉన్నారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో ఏడుగురు పారిపోయారు. 
 
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని శరణార్థులుగా గుర్తించి ప్రత్యేక శిబిరాలకు తరలిస్తుంటారు. ఆ విధంగానే 66 మంది శరణార్థులను ఒక బస్సులో తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులోని 39 మంది వలసదారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘాట్‌ రోడ్డులో వెళుతుండగా బస్సు అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. 
 
ఇటీవల కొలంబియా నుంచి 66 మంది వలసదారులు అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించారు. వీరందరినీ సరిహద్దు వద్ద విధుల్లో ఉండే సైనికులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారందరినీ గౌలాకా శరణార్థ శిబిరానికి తరలిస్తుండగా ఘాట్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించేక్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన తర్వాత ఏడుగురు వలసదారులు పారిపోయారు. వారికోసం అమెరికా పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments