Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్.. పాకిస్థాన్ వెన్నులో వణుకు.. ఎందుకో తెలుసా?

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్థాన్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ఇప్పుడు అమెరికా

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (08:31 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్థాన్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడాన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఆయన ఎన్నిక దేశవిదేశాల్లోని భారతీయులకు సంతోషం కలిగిస్తుండగా పాకిస్థానీలకు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనికి పలు కారణాలు లేకపోలేదు. 
 
ప్రధానంగా రాడికల్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆయన కఠిన చర్యలు చేపడితే ఉగ్రవాదంపై పోరుకు అమెరికా నుంచి అందే సాయం పూర్తిగా ఆగిపోతుంది. పైపెచ్చు.. అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా భారత్‌కు అనుకూలంగా మారిపోతుందని పాక్ పాలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు ట్రంప్‌ యంత్రాంగంలో భారతీయ-అమెరికన్లకు పెద్దసంఖ్యలో చోటు దక్కబోతుందంటూ వస్తున్న వార్తలు మరింత వణికిస్తున్నాయి. 
 
ఇమిగ్రేషన్‌ విధానాన్ని సంస్కరించేదాకా ఇతర దేశాల ముస్లింలను అమెరికాలోకి రాకుండా నిషేధిస్తానన్న ట్రంప్‌ మాటలు ముస్లిం దేశాలను ఇప్పటికీ భయపెడుతున్నాయి. పైగా యూరీ దాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల విధ్వంసానికి భారత సైన్యం చేపట్టిన సర్జికల్‌ దాడులను డోనాల్డ్ ట్రంప్‌ గట్టిగా సమర్థించారు. పైగా భారతలో ఆయనకు సొంత వ్యాపారాలున్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసిన పాక్ పాలకులకు వెన్నులో వణుకు పుడుతోందట. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగచైతన్య కోసం శోభిత అదంతా చేస్తుందా?

కొత్తవారితో ద్విభాషా చిత్రంగా మహా సంద్రం పూజతో ప్రారంభం

స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేర

కళ్యాణ్ బాబు ధైర్యం అంటే ఇష్టం - నాకు పోటీ ఎవరూ లేరు నేనే : అల్లు అర్జున్

అల్లు అర్జున్ కోసం పనిచేశా, ఓజీ కోసం కొరియన్ టీమ్ తో పనిచేస్తున్నా: థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments